INDIA bloc: ఢిల్లీ లిక్కర్ స్కాములో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అరెస్టును కాంగ్రెస్, టీఎంసీలతో పాటు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలోని బీజేపీ ఖూనీ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీల వంటి కేంద్ర సంస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు కేంద్ర ఏజెన్సీలతో ప్రతిపక్ష నేతల్ని భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపిస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని గురువారం రాత్రి ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ నుంచి రక్షించలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు.
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గురువారం రాత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన కస్టడీ కోరుతూ ఈ రోజు కేజ్రీవాల్‌ని రోస్ ఎవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. ఈడీ 10 రోజుల కస్టడీ కోరుతోంది. ఈ మొత్తం స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారుడని కోర్టుకు ఈడీ తెలిపింది. లిక్కర్ పాలసీ 2021-22 ద్వారా హోల్ సేల్ వ్యాపారులకు 12 శాతం, రిటైలర్లకు 185 శాతం…
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని నిన్న ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ కాకుండా రక్షణ ఇవ్వలేని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే నిన్న సాయంత్ర కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఆయన కస్టడీ కోసం రోస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టైన నాలుగో ఆప్ నేత కేజ్రీవాల్, ఆయన కన్నా ముందు ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.