జమ్మూ కాశ్మీర్ అమర్ నాథ్ లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అమర్ నాథ్ పరిసరాల్లో వరదలు సంభవించాయి. అమర్ నాథ్ గుహవద్దకు వరద నీరు చేరింది. దీంతో ఇప్పటి వరకు 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. ఇప్పటికే ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ ను మొదలుపెట్టారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అమర్ నాథ్ పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వరదలు ముంచెత్తాయి.…