మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో శరద్‌పవార్ నేతృత్వంలోని పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గడియారం గుర్తు తమకే కేటాయించాలంటూ శరద్‌పవార్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శరద్ పవార్ న్యాయ పోరాటానికి దిగారు. గడియారం గుర్తుపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గడియారం గుర్తుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ సుప్రీంకోర్టుకు తెలియజేశారు.