మధురైలో ఉసిలంపల్లిలోని ఈశ్వరి అమ్మవారి ఆలయ ఉత్సవాలలో ఘర్షణ చోటుచేసుకుంది. ఉత్సవాల సమయంలో ప్రత్యేక పూజల విషయంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. ఒకరినొకరు కర్రలతో, రాళ్లతో ఆలయంలోనే కొట్టుకున్నారు ఇరువర్గాల వారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇరువర్గాల ఘర్షణల్లో గాయపడినవారిలో పోలీసులు కూడా ఉన్నారు. అయితే, ఉత్సావాల సమయంలో ప్రత్యేక పూజల విషయంలో రెండు వర్గాలలో విబేధాలే ఈ ఘర్షణకు కారణంగా తేల్చారు…