ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన అద్భుత క్యాచ్ పట్టింది. అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకు ఆడుతున్న స్మృతి.. అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాన్ని కనబర్చింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అభిమానుల మనసు గెలుచుకుంది స్మృతి మంధాన. కళ్లు చెదిరే రన్నింగ్ క్యాచ్ పట్టుకుంది.