Smriti Mandhana: వాట్ ఏ క్యాచ్ స్మృతి.. వెనక్కు పరుగెత్తి ఎలా పట్టిందో చూడండి (వీడియో)
- అద్భుత క్యాచ్ పట్టిన స్మృతి మంధాన
- ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకు ఆడుతున్న స్మృతి
- పెర్త్ స్కార్చర్స్ తో మ్యాచ్ లో అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాన్ని కనబర్చిన స్మృతి
- కళ్లు చెదిరే రన్నింగ్ క్యాచ్ పట్టిన స్మృతి మంధాన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన అద్భుత క్యాచ్ పట్టింది. అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకు ఆడుతున్న స్మృతి.. పెర్త్ స్కార్చర్స్ తో జరిగిన మ్యాచ్ లో అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాన్ని కనబర్చింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అభిమానుల మనసు గెలుచుకుంది స్మృతి మంధాన. కళ్లు చెదిరే రన్నింగ్ క్యాచ్ పట్టుకుంది. స్కార్చర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ తొలి బంతికి లీసన్ కవర్స్ దిశగా షాట్ ఆడగా.. మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మంధన వెనక్కు పరిగెడుతూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ క్యాచ్‌పై అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also: Purandeswari: వికలాంగ క్రీడాకారిణికి ధైర్యం నింపిన ఎంపీ పురంధేశ్వరి
Also Read
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పెర్త్ స్కార్చర్స్ మహిళా కెప్టెన్ సోఫీ డివైన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో స్మృతి మంధాన అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు నుంచి ఓపెనర్ గా బరిలోకి దిగింది. మంధాన 29 బంతుల్లో 41 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. స్మృతి మంధాన ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లలో 28.80 సగటుతో 144 పరుగులు చేసింది. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.
Read Also: BJP: ఠాక్రే, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు.. శరద్ పవార్ మాటలే సాక్ష్యం..
ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మంధాన 41 పరుగులతో పాటు.. కేటీ మాక్ 34 బంతుల్లో 41, లారా వోల్వార్ట్ 28 బంతుల్లో 48 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పెర్త్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేసింది. మేగాన్ స్కట్ అద్భుత బౌలింగ్‌తో 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది. దీంతో.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
Smriti that is OUTSTANDING! 🇮🇳#WBBL10 pic.twitter.com/pxct8HJUTu
— Weber Women's Big Bash League (@WBBL) November 19, 2024
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!