సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విరమణ చేస్తున్నారు. పదవీ విరమణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తనకు జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తుచేసుకున్నారు. జీవితంలో తనకు విద్య నేర్పిన గురువులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.
ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోందని మండిపడ్డారు. కొన్ని సమయాల్లో అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయించడం కష్టమని.. ఆ తీర్పులను మీడియా ఇస్తోందన్నారు.
హైదరాబాద్‌లో రూపుదిద్దుకుంటున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ వల్ల హైదరాబాద్ ఖ్యాతి మరింతగా పెరుగుతుందన్నారు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. గచ్చిబౌలి లో IAMC నిర్మాణానికి భూమిపూజ చేశారు చీఫ్ జస్టిస్ ఎన్.వీ. రమణ. భారతదేశంలో మొదటి IAMC అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విశేషం అన్నారు. IAMC నిర్మాణానికి గచ్చిబౌలి లోని ఐకియా వద్ద 3.7 ఎకరాల భూమిని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి మంత్రులు…
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేటి నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కృష్ణా జిల్లాలోని ఎన్వీ రమణ సొంతూరైన పొన్నవరం రానున్నారు. గత రెండుసంవత్సరాల క్రితం జస్టిస్ ఎన్వీ రమన్ తన సొంతూరు వచ్చారు. అయితే తొలిసారి సీజేఐ హోదాలో స్వగ్రామానికి ఎన్వీ రమణ విచ్చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనను పొన్నవరంలో ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్వీ రమణ స్వగ్రామానికి వస్తున్నందున గ్రామస్థుల అభినందన…
నేతల క్రిమినల్ రికార్డులపై రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు… ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఇది రాజకీయ నేతలకు ఇష్టం లేని అంశంగా ఉందని.. అందుకే సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రపతిని కలిసినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన…