CJI BR Gavai: మంగళగిరి CK కన్వెన్షన్ లో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మాట్లాడుతూ.. నా స్వస్థలం మహారాష్ట్రలో అమరావతి.. సీజేఐగా నా చివరి కార్యక్రమం ఇక్కడ అమరావతిలో జరుగుతోంది.. మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నాను.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది.. సాంఘిక, ఆర్థిక న్యాయం సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు అని పేర్కొన్నారు. చాయ్ వాలా ప్రధాని అవటానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉపయోగపడింది.. లోక్ సభ స్పీకర్ గా బాల యోగి, మీరా కుమారి రావటానికి కూడా రాజ్యాంగం కారణం అన్నారు.
Read Also: Delhi Car Blast: ఢిల్లీ పేలుడు వెనక ‘‘సైతాన్ తల్లి’’.? ఫోరెన్సిక్ అనుమానం..
అలాగే, భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాది ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎప్పుడూ స్థిర పత్రంగా భావించలేదు.. కాలానికి అణుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించారని తెలిపారు. అంశం యొక్క ప్రాధాన్యత బట్టి రాజ్యాంగ సవరణ విధానాన్ని అంబేద్కర్ ఏర్పాటు చేశారు.. కొన్ని అంశాల్లో మాత్రమే రాజ్యాంగ సవరణ సులభతరంగా ఉన్నాయి.. కొన్ని అంశాల్లో ఇది చాలా కఠినంగా ఉంటుంది.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏడాది సవరణ చేసుకున్నాం.. రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగంలో మొదట సవరణ చేసుకున్నామని జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు.