ఏపీలో విచిత్రమయిన పరిస్థితి ఏర్పడింది. థియేటర్లలో టికెట్ల రచ్చ కొనసాగుతుండగా వివిధ జిల్లాల్లో థియేటర్ల సీజ్ వివాదం రేపుతోంది. థియేటర్లపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడైనా ఉల్లంఘించినట్లు తేలితే థియేటర్లను మూసేస్తున్నారు. ఎక్కడికక్కడ నోటీసులు జారీ చేయడంతో పాటు లైసెన్స్, ఉల్లంఘనపై పూర్తిగా నిఘా పెట్టారు. క్యాంటీన్లను కూడా వదిలిపెట్టడం లేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. థియేటర్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు, పోలీసులు. కలెక్టర్లు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ప్రతీ చోటా థియేటర్ కు…