సుపరిపాలన అందించడం వల్లే బీజేపీని వరుసగా మూడుసార్లు ప్రజలు గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ప్రభువైన ఏసు క్రీస్తును భక్తిశ్రద్ధలతో ఆరాధించేందుకు క్రైస్తవులు సంసిద్ధమవుతున్నారు. క్రిస్మస్ పండుగలో ప్రధాన పాత్ర పోషించే స్టార్లు, క్రిస్మస్ ట్రీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
క్రిస్మస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక దినం మన సమాజంలో సామరస్యం, ఆనంద స్ఫూర్తిని మరింతగా పెంపొందించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.