కొంత కాలంగా వరుస ఫ్లాప్ లతో సతమతమైన గోపిచంద్‌కు సీటీమార్ సినిమా కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. అయితే ఈ చిత్రం ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా కూడా వసూళ్ళు చేసింది. కాగా ప్రస్తుతం గోపిచంద్ నటించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న మెగా154 సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 2023 సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ‘జనవరి 2023,సంక్రాంతి కి కలుద్దాం’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. టైటిల్ తో పాటు టీజర్ త్వరలో విడుల చేస్తామంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, అందులో పడవలు కనిపిస్తుండగా చిరంజీవి చేతిలో లంగరుతో ఉన్న పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ…
మెగాస్టార్ స్టైల్, డాన్స్, మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరం హీరోల్లో చాలామంది ఆయన ఇన్షిపిరేషన్తో వచ్చిన వారే ఉన్నారు. ముఖ్యంగా డాన్స్ విషయంలో మెగాస్టార్‌ను ఫాలో అవని హీరోలు లేరనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు మెగాస్టార్‌ను ఇమిటేట్ చేసిన హీరోలు.. అభిమానులు చాలామందే ఉన్నారు. కానీ మరో స్టార్ హీరోని మెగాస్టార్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అదే చేశారు మెగాస్టార్ చిరంజీవి. అది చూసిన తర్వాత.. మెగాభిమానులే…
ప్రతి వ్యక్తి జీవితంలో తొలి హీరో తండ్రి అనే చెప్పాలి. మన వెనుక నీడగా వుండి, అండగా నిలబడి తన బిడ్డ గొప్పగా ఎదగాలని, తన కొడుకు గురించి ప్రతి ఒక్కరు చెప్పుకోవాలని ఆపడతాడు ఆతండ్రి. తన కొడుకు మరొకరు పొగుడుతుంటే నాన్న ఆనందం ఆశాన్నంటుతుంది. తన కొడుకు ఉన్నతికి పాటు పాడే నాన్న గొప్పతనాన్ని ఓ రోజులో చెప్పుకుంటే సరిపోతుందా! అంటే సరి కాదనే సమాధానమే వినిపిస్తుంది. కుటుంబం కోసం తండ్రి చేసే త్యాగాలను గుర్తు…
వేలాది మంది ఔత్సాహిక గాయనీ గాయకులు, ప్రధాన నగరాల్లో జరిగిన వడపోత, ముగ్గురు న్యాయ నిర్ణేతలు, పదిహేను వారాల పాటు జరిగిన ప్రదర్శన… చివరగా విజేతకు మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ! ఇదీ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం జరిగిన విధానం. ఫిబ్రవరి మూడోవారంలో ఆహాలో మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ కాంటెస్ట్ జూన్ 17వ తేదీతో ముగిసింది. ఈ షో సెమీ ఫైనల్స్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా హాజరు…
‘ఆచార్య’తో డీలా పడ్డ మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. అవి కాకుండా కొత్తదనం ఉన్న స్క్రిప్ట్లకోసం కూడా తాపత్రయపడుతున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి ‘విక్రమ్’ సినిమా చూసి కమల్ హాసన్ తో పాటు దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ని ఆహ్వానించి అభినందించారు. అంతే కాదు అదే మీట్ లో ప్రభాస్‌కు లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ గురించి కూడా అడిగి తెలుసుకున్నాడట. అయితే ఆ స్క్రిప్ట్ ను ప్రభాస్ నిరాకరించిన విషయం తెలిసినదే.…
తెలుగు ఇండియన్ ఐడిల్ లో పాల్గొన్న ఫైనలిస్టులకు సూపర్ ఛాన్సెస్ అదే వేదిక మీద దక్కాయి. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్స్ లో చిన్నదైన వైష్ణవికి ఏకంగా సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయనతారకు ప్లే బ్యాక్ పాడే ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం నయనతార, చిరంజీవి మూవీ ‘గాడ్ ఫాదర్’లో ఆయన చెల్లిగా నటిస్తోంది. వీరిద్దరి మీద వచ్చే ఓ పాటలో నయన్ కు వైష్ణవితో ప్లేబ్యాక్ పాడిస్తానంటూ తమన్ ఈ వేదిక మీద మాట ఇచ్చాడు. వైష్ణవి…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న మెగా154 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీజీవి, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ షూటింగ్లో పాల్గొంటున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంపై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ సమయంలో దర్శకుడు సుకుమార్ ఈ మూవీ సెట్ కు వెళ్ళారు. సుకుమార్ సెట్ లో వున్న ఫోటోని అభిమానులతో పంచుకుకుంది…
అటు తమిళం ఇటు తెలుగులో హాట్ టాపిక్ లోకేశ్ కనకరాజ్. కమల్ హాసన్ తో లోకేష్ తీసిన ‘విక్రమ్’ సినిమా అఖండ విజయం సాధించింది. కమల్ కున్ను అప్పులన్నింటినీ తీర్చిన సినిమాగా ‘విక్రమ్’ నిలిచింది. సందీప్ కిషన్ తో తీసిన ‘మానగరం’, ఆ తర్వాత కార్తీతో ‘ఖైదీ’, విజయ్ తో ‘మాస్టర్’ సినిమాలు సైతం లోకేష్ ప్రతిభకు పట్టం కట్టాయి. ఇప్పుడు ‘విక్రమ్’తో అపజయం ఎరుగని దర్శకుల ఖాతాలో చేరిపోయాడు లోకేష్. దాంతో టాలీవుడ్ లో లోకేష్…