UnStoppable 2: ఇండస్ట్రీలోనే మొదటిసారి.. బాలయ్య షోకు పవన్.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UnStoppable 2: నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాకుండా ఓటీటీలో కూడా తనదైన స్టైల్లో రచ్చ చేసిన షో అన్ స్టాపబుల్. ఆహా ఓటిటీ లో ప్రతివారం సందడి చేసే ఈ షో లో అతిరధ మహారధులు బాలయ్య తన మాటలతో చేతలతో భయపెట్టి, ఆడించి, పాడించి బోల్డంత వినోదాన్ని ప్రేక్షకులకు అందించాడు. 10 ఎపిసోడ్లతో ఈ సీజన్ ముగిసింది. బాలయ్య బాబు .. హోస్టింగ్ ఏం చేస్తాడు లే అనుకున్నవారి చేత.. బాలయ్య బాబు.. హోస్టింగ్ ఏం చేశాడు రా అని అనిపించుకున్నాడు. దీంతో ఈ షో సీజన్ 2 కోసం అభిమానులు ఎంత గానో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్వరలోనే అన్ స్టాపబుల్ 2 తో బాలయ్య మరోసారి రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. అయితే ఈసారి గెస్టుల లిస్ట్ చూస్తుంటే అభిమానుల కళ్ళలో వెయ్యి వోల్టుల లైట్ వెలుగుతోంది. ఈ సీజన్ లో ముఖ్యంగా ముగ్గురు స్టార్ హీరోలు సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో మొదటి హీరో మెగాస్టార్ చిరంజీవి.
గత సీజన్ లోనే చిరు రానున్నట్లు వార్తలు వచ్చినా అది కుదరలేదు. ఇక ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ను చిరునే లాంచ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రెండో హీరో నాగార్జున.. ఈయన కూడా ఈ సీజన్లో సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మూడో హీరో.. పవన్ కళ్యాణ్. ఈ వార్త తెలియడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షేక్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే పవన్ ఇప్పటివరకు ఏ షో కు వెళ్ళింది లేదు. రాజకీయాల్లోకి వచ్చాక కనీసం సినిమా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది లేదు. అలాంటి పవన్ తన స్నేహితుడు త్రివిక్రమ్ తో కలిసి ఈ షో కు హాజరవుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే అభిమానుల తీరని కోరికగా మిగిలిపోయిన ఈ కోరిక నెరవేరినట్లే.. అల్లు అరవింద్ షో కాబట్టి.. చిరుతో కలిసి అరవింద్, పవన్ ఒప్పించి ఉంటారని అంటున్నారు. ఇక ఈ షోలో బాలయ్య.. పవన్ ను ఎలాంటి ప్రశ్నలు సంధిస్తాడో.. పవన్ ఎలాంటి సమాధానాలు ఇస్తాడో చూడాలి . మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.
Also Read
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
తాజావార్తలు
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!