God Father: మెగాస్టార్ చిరంజీవి- మోహన్ రాజా కాంబోలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నదని టాక్ నడుస్తోంది. అన్నీ ఓటిటీలో తో పోటీ పడి నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 57 కోట్లు పెట్టి ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నిజం చెప్పాలంటే.. ఆచార్య నిరాశ పర్చడంతో మెగా అభిమానులందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. చాలా రోజుల తరువాత చిరు రాజకీయాల నేపథ్యంలో సినిమా చేయడం, నయనతార చిరుకు చెల్లెలిగా చేయడం.. మొట్ట మొదటిసారి చిరు సినిమాలో సల్మాన్ గెస్ట్ గా చేయడం.. ఇవన్నీ ఈ సినిమాపై అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా మార్కెట్ కూడా మంచిగా ఉండడంతో ఈసారి చిరు పక్కా హిట్ కొట్టేలా ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.