God Father: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ తార్ మార్ తక్కర్ మార్ ఆడియోను ఇప్పటికే రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా లిరికల్ వీడియోను రిలీజ్చేశారు.. బాసులు వచ్చిండ్రే.. బేసులు పెంచండ్రే అంటూ మొదలైన సాంగ్ కు చిరు, సల్మాన్ ల ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇద్దరు డాన్ లు ఒక్కసారిగా అలా నడుచుకుంటూ వస్తుంటే ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయం. ఇక తార్ మార్ తక్కర్ మార్ స్టెప్ అయితే సింపుల్ గా ఉన్నా స్టైలిష్ గా అనిపిస్తోంది.
అనంత్ శ్రీరామ్ లిరిక్స్, థమన్ మ్యూజిక్ ఒక ఎత్తు అయితే.. శ్రేయా ఘోషల్ మాస్ వాయిస్ మరో ఎత్తు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభు దేవా కొరియోగ్రఫీ గురించి.. ఒక పార్టీ సాంగ్ లో ఊర మాస్ స్టెప్స్ తో చిరు, సల్మాన్ ఎక్కడా తగ్గకుండా చిందులు వేయించినట్లు కనిపిస్తోంది. ఇక సిగ్నేచర్ స్టెప్ లో చివరిలో ప్రభుదేవా కూడా కనిపించడం హైలైట్ గా మారింది. మొత్తానికి ఈ సాంగ్ ఒక చార్ట్ బస్టర్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇక డ్యాన్స్ లో చిరు గ్రేస్ ను కొట్టేవారే లేరు.. సల్లు భాయ్ సైతం చిరుకు పోటీ పడేందుకు కొద్దిగా కష్టపడినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సాంగ్ ను సినిమాలో ఉంచుతారా..? లేక ప్రమోషనల్ సాంగ్ గా వాడుతారా..? అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.