ఈరోజు ఉగాది పర్వదినం. హిందూ సంప్రదాయం ప్రకారం తెలుగువారికి న్యూ ఇయర్ అన్నమాట. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది కూడా ఒకటి. హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. ఈరోజు శార్వారీ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలికాము. ఈ రోజున షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్రదర్శనము, ఆర్యపూజనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు. కాగా…