మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఆచార్య” చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ సినిమా ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న మెగా అప్డేట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా “ఆచార్య” చిత్రం నుంచి పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ రిలీజ్ చేస్తారు అంటున్నారు. మరో రెండు రోజుల్లో “ఆచార్య” రిలీజ్ డేట్ రివిల్ కాన్ ఉందన్నమాట. ఈ ఈ వార్తల ప్రకారం అక్టోబర్ 13న సినిమా రిలీజ్ అవుతుందని, లేదంటే “ఆచార్య” నుంచి సెకండ్ సింగిల్ లో రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. మొత్తానికి మెగాస్టార్ బర్త్ డే ట్రీట్ గా ఏదో ఒక అప్డేట్ ఉండడం అయితే ఖాయంగా కన్పిస్తోంది.
Read Also : ట్రైలర్ : శ్రీదేవికి పెళ్ళి చేసేస్తార్రా… సూరిబాబు వదులుతాడా ?
రిలీజ్ డేట్ ను ప్రకటించడం చిరు సినిమా ఆలస్యం చేసింది. “ఆచార్య” మేకర్స్ ఆలోచించుకునే లోగానే మిగతా పెద్ద సినిమాల నిర్మాతలు వినాయక చవితి, సంక్రాంతి పండుగల్లో రిలీజ్ డేట్లపై ఖర్చిఫ్ వేసేశారు. దీంతో “ఆచార్య” రిలీజ్ డేట్ సంగతి చిరు అభిమానుల్లో ఆందోళనకరంగా మారింది. కానీ కొంతమంది మాత్రం చిరు కావాలనే సినిమా తేదీని ప్రకటించలేదని, చెప్పిన తేదీకే సినిమాను విడుదల చేస్తామని చెప్పుకొస్తున్న రాజమౌళి “ఆర్ఆర్ఆర్” పొరపాటున వెనక్కి తగ్గిందంటే… అదే రోజు “ఆచార్య”ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి వేచి చూస్తున్నారని అంటున్నారు. అన్నట్టుగానే “ఆర్ఆర్ఆర్” మూవీ విడుదల వాయిదా పడే అవకాశం కన్పిస్తోంది. ఈ విషయంపై త్వరలోనే “ఆర్ఆర్ఆర్” టీం ప్రెస్ మీట్ పెట్టనుంది. ఆ తరువాతే “ఆచార్య” రిలీజ్ డేట్ విషయంపై స్పష్టత వస్తుంది. ఏదేమైనా “ఆర్ఆర్ఆర్” సినిమా రిలీజ్ డేట్ పై “ఆచార్య” కన్నేశాడన్నమాట.
ఇక కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య”లో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. రామ్ చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రలు పోషించారు. రామ్ చరణ్‌తో కలిసి నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మణి శర్మ సంగీతం సమకూరుస్తున్నారు.