సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈనెల 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరైయ్యారు.
హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. చిరంజీవి గారి సినిమాల్లో డాన్సులు చూసీ చూసీ నాకు అదే గ్రేస్ అలవాటు అయ్యింది. ఆయన నా డాన్సింగ్ టాలెంట్ గురించి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అమీర్ ఖాన్ గారు నా సినిమా ఈవెంట్ కు వస్తారని కలలో కూడా అనుకోలేదు. కానీ ఇవాళ అది నిజం కావడం నమ్మలేకపోతున్నాను. అమీర్ ఖాన్ గారు ఎప్పుడూ మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తుంటారు.
నేను విభిన్నమైన క్యారెక్టర్ కు న్యాయం చేయగలను అని దర్శకుడు శేఖర్ కమ్ముల గారు నమ్మడమే పెద్ద బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను. ఆయన డైరెక్షన్ లో నాకిది రెండో సినిమా. ఒక్కసారి శేఖర్ కమ్ముల గారి సినిమా సెట్ కు వెళ్తే ఎంత వినయంగా పనిచేయాలో, ఎంత ఒద్దికగా ఉండాలో తెలుస్తుంది. అదే ఎనర్జీతో నేను మిగతా చిత్రాల సెట్స్ కు వెళ్తుంటాను. ఈ టీమ్ తో మరో సినిమా వెంటనే చేయాలని కోరుకుంటున్నాను.
నాగ చైతన్య వండర్ ఫుల్ కో స్టార్. ఆయనతో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. శేఖర్ గారి చిత్రాల్లో సమాజానికి చెప్పేందుకు ఏదో ఒక విషయం ఉంటుంది. అలాగే ఇందులో అమ్మాయిలు చూసి తెలుసుకునేందుకు ఒక ముఖ్యమైన విషయం ఉంది. వాళ్లంతా లవ్ స్టోరి చూశాక, ఒక ఆలోచనతో ఇంటికి వెళ్తారు. మిమ్మల్ని మీరు వేసుకునే ఒక ప్రశ్నతో ఇంటికి వెళ్తారు. అన్నారు.