నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. ఈ సందర్బంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరైయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో చిరు, సాయి పల్లవి గూర్చి మాట్లాడిన విషయాలు నవ్వులు పూహించాయి.
మెగాస్టార్ చిరంజీవి ఎంత గొప్ప డ్యాన్సరో అందరికి తెలిసిందే. కానీ చిరంజీవి మాత్రం సాయి పల్లవి డ్యాన్స్ కి ఫిదా అయ్యారట.. “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఈ విషయాన్ని బయటపెట్టారు. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహెర్ రమేష్ ‘భోళా శంకర్’ అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో చెల్లెలు పాత్రకి మొదట సాయి పల్లవిని అడిగారు. కానీ ఆమె ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ‘సాయి పల్లవిని చెల్లెలు పాత్రకు అడుగుతున్నామని డైరెక్టర్ చెప్పినప్పుడు, సరే అన్నాను. కానీ మనసులో మాత్రం ఆమె రిజెక్ట్ చెయ్యాలని అనుకున్నాను. ఆమె ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలీదు కానీ నాకు సంతోషం వేసింది. ఎందుకంటే, అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్పులు వేస్తె బాగుంటుంది కదా, అని చిరంజీవి అన్నారు. ఇకచిరు-సాయి పల్లవి చేసిన డాన్స్ ఈవెంట్ లో హైలైట్ గా నిలిచింది.