మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఎన్నో వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్, కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో చరణ్ షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. గత నాలుగేళ్లుగా చరణ్, చిరుతో కలిసి ఉండడం లేదని చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఉండడం, ఫంక్షన్ లకు కలిసి వెళ్లడం కాకుండా ఇలా తండ్రి కొడుకులు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు చరణ్ ఎమోషనల్ అయ్యాడు. తండ్రితో తనకున్న అనుబంధాన్ని ఏకరువు పెట్టాడు.
” నిజంగా ఆ ఎక్స్ పీరియన్స్ మాటల్లో చెప్పలేను. 20 రోజులు పైన మేము ఇద్దరం కలిసే ఉన్నాం.. మా ఇద్దరికీ ఒకే కాటేజ్ ఇచ్చారు. ఆ సమయం కోసం నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను. నేను గత నాలుగేళ్లుగా వేరే ఇంట్లో ఉంటున్నా.. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కన్ స్ట్రక్షన్ జరుగుతున్న కారణంగా మేము ఇద్దరం వేరే వేరు గా ఉంటున్నాం. సండే స్ మాత్రమే కలుస్తున్నాం. ఆ సమయంలో ఇలాంటి ఒక అవకాశం వచ్చింది. నెల రోజులు మేము ఇద్దరం పొద్దున్నే లేవడం.. కలిసి భోజనం చేయడం..కలిసి ఒకే కారులో షూటింగ్ కు వెళ్లడం.. షూట్ అయిపోగానే ఇద్దరం కలిసి ఒకే కారులో తిరిగి రావడం.. ప్రతీ రోజు మార్నింగ్ 5:30 గంటలకు లేచి కలిసి వర్కవుట్ లు చేయడం..అది నా జీవితంలో మోస్ట్ మెమరబుల్ టైమ్. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నాకు ఇలా ఉంటె నాన్నగారు ఐదో రోజో .. ఆరోరోజో పిలిచి చరణ్ నీకు అర్ధం కావడం లేదు. ఎప్పటికో కానీ మనకు ఇలాంటి అవకాశం రాదు.. ఆచార్య వల్ల ఆ అవకాశం మనకు వచ్చింది. ఎవ్రీ సింగిల్ డేని సింగిల్ మినిట్ ని ఎంజాయ్ చేద్దాం. ఇలా నాకు మళ్లీ నీతో ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు అని చెప్పారు. నాకు లోపల అదే ఫీలింగ్ ఉన్నా అది నేను చెప్పలేకపోయాను.. ఆయన చెప్పారు” అంటూ భావోద్వాగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.