Intel layoffs: మరో టెక్ సంస్థ భారీ మొత్తంలో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. చిప్‌మేకర్ ‘‘ఇంటెల్’’ పునర్నిర్మాణంలో భాగంగా ఏకంగా 25,000 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని భావిస్తోందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. 2025 చివరి నాటికి తన ఉద్యోగుల సంఖ్యను 75,000 మందికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది చివరి నాటికి ఇంటెల్‌లో మొత్తం 1,08,900 మంది ఉద్యోగులు ఉన్నారు.
Manufacturing in India: సెమీకండక్టర్ విషయాలలో దేశాన్ని స్వావలంబనగా మార్చే ప్రయత్నాలు విజయవంతం కావడం ప్రారంభించాయి. చాలా విదేశీ కంపెనీలు భారతదేశం కోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేశాయి.