Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Munugode Bypoll
  • Gorantla Madhav
  • Heavy Rains
  • Asia Cup 2022
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Off The Record Tdp Reverse Attack On House Arrests In Ap

TDP : ఏపీలో హౌస్ అరెస్టులపై టీడీపీ రివర్స్ అటాక్..?

Published Date :June 25, 2022
By Sista Madhuri
TDP : ఏపీలో హౌస్ అరెస్టులపై టీడీపీ రివర్స్ అటాక్..?

ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆ గడువు సమీపించే కొద్దీ టీడీపీ ఏదోక కార్యక్రమం చేపడుతూనే ఉంది. ఏదైనా సంఘటనలు జరిగితే బాధిత కుటుంబాన్ని పలకరించేందుకు బృందంగా వెళ్లడం ద్వారా పొలిటికల్ మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది టీడీపీ నేతలకు. హౌస్ అరెస్టులు చేస్తుండటంతో నాయకులు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఫలితంగా ముందుగా అనుకున్న కార్యక్రమం సక్సెస్ కావడం లేదనే భావనలో ఉందట టీడీపీ. ఆ అంశంపైనే తెలుగుదేశంలో చర్చ జరుగుతోంది.

కేసులు.. గృహ నిర్బందాలపై తీవ్ర తర్జనభర్జన తర్వాత విరుగుడు మంత్రం కనిపెట్టిందట టీడీపీ. ఇకపై పోలీసులపైనా ప్రైవేట్‌ కేసులతో విరుచుకుపడాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. నేతలు ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాలకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే.. దానిని సవాల్‌ చేయాలని చూస్తున్నారట. దీనిపై న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. హౌస్ అరెస్ట్ అంటే అక్రమంగా నిర్బంధించడమేనని.. పెద్ద పెద్ద కారణాలు లేకుండా అలాంటి చర్యలు తీసుకోకూడదని నిపుణులు వెల్లడించారట. అందుకే హౌస్‌ అరెస్ట్‌లకు పాల్పడి.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని భావిస్తున్న పోలీసులపై ప్రైవేట్‌ కేసులు వేయడానికి టీడీపీ నిర్ణయించిందట.

గతంలో మాజీ ఎమ్మెల్యే కూన రవి ఇదే తరహాలో ప్రైవేట్ కేసు పెట్టారని గుర్తు చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఇటీవలకాలంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సైతం రూటు మార్చేశారు. మూడేళ్లుగా తనపై వరస కేసులు నమోదు చేయించుకున్న ఆయన.. రివర్స్‌ కేసులు పెడుతున్నారట. ఇలాంటి ప్రైవేట్‌ కేసుల విచారణ మరింత ముందుకెళ్తే పోలీసులు గగ్గోలు పెట్టడం ఖాయమనే ఆలోచనతో ఉన్నారట చింతమనేని. అంతేకాదు.. కొన్ని ఆరోపణలపై లోకల్‌ వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిపై అనుచరులతో కోర్టులో పిల్‌ కూడా దాఖలు చేయించారట.

ఇదే తరహాలో రాష్ట్రంలో పోలీసులు టీడీపీ నేతల్ని ఎవరెవర్ని అడ్డుకున్నారు? ఎక్కడెక్కడ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారనే దానిపై సమాచారాన్ని సేకరిస్తున్నారట పార్టీ పెద్దలు. జిల్లాల వారీగా జాబితాను టీడీపీ అధినాయకత్వం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ జాబితాలో ప్రతి జిల్లాకు చెందిన నలుగురు నుంచి ఐదుగురు పోలీసు అధికారులు ఉన్నారని తెలుస్తోంది. ఆ విధంగా మొత్తం 55 నుంచి 65 మంది పోలీసు ఆఫీసర్లపై ప్రైవేట్ కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు.. శ్రేణులు ఈ విషయంలో పక్కా కసరత్తు చేస్తున్నారట. టీడీపీకి చెందిన న్యాయ నిపుణులు సూచించిన విధంగా వివరాలు.. ఆధారాలు దగ్గర సేకరించి.. వాటిని పక్కాగా పార్టీ రాష్ట్ర ఆఫీసుకు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ వచ్చాక.. న్యాయ నిపుణులు మరోసారి పరిశీలిస్తారట. అంతా ఓకే అనుకున్న వెంటనే పోలీసు అధికారులపై ఒకేసారి ప్రైవేట్‌ కేసులు దాఖలు చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు సమాచారం. ఏపీలో రాజకీయం వాడీవేడీగా ఉన్న తరుణంలో టీడీపీ వేస్తున్న ఈ ఎత్తుగడ ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

  • Tags
  • Abbaya Chowdary
  • chintamaneni prabhakar
  • kuna ravi
  • tdp
  • ycp

WEB STORIES

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తారలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే..?

"స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తారలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే..?"

ఇండియాలో అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న సినిమా థియేటర్లు ఇవే..!!

"ఇండియాలో అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న సినిమా థియేటర్లు ఇవే..!!"

Using Phone in Toilet: ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?

"Using Phone in Toilet: ఆగండి.. బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా?"

Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్‌వాలా గురించి కొన్ని వాస్తవాలు

"Rakesh Jhunjhunwala: రాకేష్ జున్‌జున్‌వాలా గురించి కొన్ని వాస్తవాలు"

టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?

"టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?"

జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

"జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.."

Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం

"Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం"

జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?

"జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?"

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

Atal Bihari Vajpayee: దేశ గమనాన్ని మార్చిన నేత వాజ్‌పేయ్..

MP Gorantla Madhav Nude video call Issue: ఎంపీ గోరంట్ల మాధన్ న్యూడ్ వీడియో కాల్..! ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ బయటపెట్టిన టీడీపీ..!

Ganji Chiranjeevi Resign: టీడీపీకి షాకిచ్చిన గంజి చిరంజీవి.. సంచలన వ్యాఖ్యలు.. లోకేష్‌ ఎఫెక్ట్..!

Nara Lokesh: లోకేష్‌ కీలక సూచనలు.. అధ్యయనానికి టీడీపీ కమిటీ..

Vangalapudi Anitha: రేప్ చేసినా రేపు రండి అనే స్థితిలో ఏపీ పోలీసు శాఖ..! అనిత ఫైర్‌

తాజావార్తలు

  • Bandla Ganesh: రంభల రాంబాబు గారికి త్వరలో మా సార్ సమాధానం చెప్తారు

  • ITBP Bus Accident: ఐటీబీపీ బస్సు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

  • Free Hugs Social Experiment: ఫ్రీ హగ్ సోషల్ ఎక్స్‌పరిమెంట్ కు సూపర్ రెస్పాన్స్

  • Brahmaji: బ్రహ్మజీ గొప్పమనసు.. అతనికోసం పిల్లలనే త్యాగం చేశాడట

  • Tollywood Film Producers : షూటింగ్స్ మొదలయ్యేది ఎప్పటినుంచి!?

ట్రెండింగ్‌

  • Krishnashtami: కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారు? ఉట్టి కొట్టడంలో దాగి ఉన్న రహస్యమేంటి?

  • Har Ghar Tiranga: ‘అద్భుత విజయం’. హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో 5 కోట్లకు పైగా సెల్ఫీల అప్‌లోడ్‌

  • India as Vishwa Guru again: ఇండియా మళ్లీ విశ్వ గురువు కావాలనే భావన.. ప్రతి భారతీయుడి హృదయ స్పందన..

  • Pincode: గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న పిన్‌కోడ్.. అసలు పిన్‌కోడ్ ఎలా పుట్టింది?

  • Azadi ka amrit mahotsav: భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టం.. స్వాతంత్ర్య అమృత మహోత్సవం..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions