TDP Leader :చింతమనేని కి ప్రాణహాని ఉందని కోర్టులో పిటిషన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చింతమనేని ప్రభాకర్. దెందులూరు మాజీ ఎమ్మెల్యే. ప్రభాకర్ ఎక్కడుంటే అక్కడ వివాదం అన్నట్టు రాజకీయాలు మారిపోయాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన దూకుడే ఆ ప్రచారాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం అధికార బలం లేకపోయినా అనుచరగణం వెంటే ఉంది. ఈ క్రమంలో చేసిన పనుల వల్ల వరసగా కేసుల్లో కూరుకుపోయారు చింతమనేని. అధికారంలో ఉన్నప్పుడు.. గత ఎన్నికల టైమ్‌లో వైసీపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాజకీయంగా కాకరేపుతున్నాయి. కేసులంటే భయపడని చింతమనేని.. తాజాగా కొత్తదారి ఎంచుకోవడంతో చర్చగా మారింది. తనకు ప్రాణహాని ఉందని.. తన అనుచరులనూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ కోర్టుకు, కేంద్ర హోంశాఖకు, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు చింతమనేని.
2019 ఎన్నికల తర్వాత తనపై భౌతికంగా దాడులు చేస్తున్నారన్నది చింతమనేని ఆరోపణ. తనతోపాటు ఉన్నవారినీ.. చివరకు తన లాయర్‌ను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఏలూరు కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసేశారు చింతమనేని. ప్రభుత్వ సలహాదారు సజ్జలతోపాటు మాజీ డీజీపీ గౌతంసవాంగ్ తదితర 21 మందిపై ఆ పిటిషన్‌లో ఆరోపణలు చేశారు. నిన్నమొన్నటి వరకు కేసులంటే లెక్కేచేయని చింతమనేని ఇపుడు తన ప్రాణానికి ముప్పుందని గవర్నర్, కేంద్ర హోంశాఖలతోపాటు కోర్టును ఆశ్రయించడమే ఆసక్తి కలిగిస్తోంది.
Also Read
- Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
- Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు... ఆ సీట్లు దక్కేదెవరికి..?
- Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా... ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి...?
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ పరిణామాలు చూసిన వారు చెబుతున్నది ఒక్కటే.. అధికారిపార్టీపై చింతమనేని రివర్స్ అటాక్ మొదలు పెట్టారని. చేతిలో అధికారం ఎలాగూ లేదు. ఇప్పుడు తిరగబడి పోరాడితే పోయేదేం లేదని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఈ ఆలోచనతోనే వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదులు మొదలుపెట్టారు చింతమనేని. పైగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇబ్బంది పెడుతున్నారని స్వరం పెంచారు. ఈ చర్యలతో డీలాపడ్డ కేడర్‌కూ ధైర్యం వస్తుందని లెక్కలు వేస్తున్నారట. దెందులూరులో తాను అమలు చేయబోయే యాక్షన్ ప్లాన్‌కు కేడర్ అంతా ధైర్యంగా సహకరిస్తుందని అభిప్రాయపడుతున్నారట. ఇప్పటికే బాదుడే బాదుడు పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్న చింతమనేని ఇకపై ఏం జరిగినా అమీతుమీ తేల్చుకోవాలని అనుకుంటున్నారట. మరి.. చింతమనేని ఎంచుకున్న ఈ మార్గం ఆయనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?