ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే ప్రజావాణి కార్యక్రమం అమల్లోకి వచ్చిందని.. ఆ కార్యక్రమ పురోగతిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడారు. 50 వారాలుగా ప్రజావాణిని ప్రభుత్వం నిరాటంకంగా నిర్వహించిందని తెలిపారు. ఇప్పటివరకు ప్రజావాణికి అందిన దరఖాస్తులు 5,23,940 కాగా.. అందులో 4,31,348 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయని, మిగిలినవి 92,592 దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయని వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారికి సన్మాన కార్యక్రమాలు ఉంటాయని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. 3, 4, 5 తేదీల కార్యక్రమాలు త్వరలో చెబుతామన్నారు. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి మొదట నివాళులు అర్పించిన తర్వాత.. బాబూ జగజ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పిస్తాం.. హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చిన్నారెడ్డి చెప్పుకొచ్చారు.
OFF The Record: వనపర్తిలో కాంగ్రెస్ రాజకీయం రోడ్డున పడింది. కాంగ్రెస్ సీనియర్ నేతకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు పార్టీ నాయకులు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌కే.. క్రమశిక్షణ లేదని ఆందోళనకు దిగారు. ఇంతకీ ఎందుకీ రచ్చ? వనపర్తి కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికి ఎర్త్ పెడుతుంది ఎవరు? చిన్నారెడ్డికి అంతకోపం ఎందుకు వచ్చింది? రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే చిన్నారెడ్డికి అసలేమైంది? వనపర్తిలో గడిచిన కొన్నిరోజులుగా సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డికి.. స్థానిక…
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి కాంగ్రెస్‌లో వార్ పీక్స్‌కు చేరుకుంటోంది. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకుని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. యువతతో కలిసి వనపర్తిలో శివసేనారెడ్డి కార్యక్రమాలు స్పీడ్ పెంచడంతో చిన్నారెడ్డి వర్గం కలవర పడుతోందట.చిన్నారెడ్డి మాజీ మంత్రి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గానూ ఉన్నారు. పార్టీ తనను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వబోదనే ధీమాతో ఉన్నారు చిన్నారెడ్డి. దీంతో పాత, కొత్త…
తెలంగాణలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి. యాసంగిలో వరి సాగు తగ్గింది. కేసీఆర్ మాటలకు ఎవ్వరూ కూడా వరి సాగు చేయలేదు. కేంద్రం ధాన్యం కొనాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం రా రైస్ కొంటాం కానీ, బోయిల్డ్ రైస్ కొనమని చెప్తోంది. గత వానాకాలంలో మీరు చేసిన పని వల్ల రైతులు నష్టపోయారు.. గతంలో ప్రభుత్వం ధాన్యం కొనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఇప్పుడు కూడా…
శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీనే క్రమశిక్షణ తప్పిందా? ఇన్నాళ్లు క్రమశిక్షణ కమిటీపై రాని ఆరోపణల ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? చిన్నారెడ్డి కామెంట్స్‌తో మరో మలుపు తిరిగిన రగడతెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లక్ష్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. మెదక్ పర్యటన సమాచారం ఇవ్వలేదనే అంశంపై మొదలై.. రేవంత్ కూడా కోవర్టే అనే వరకు విమర్శలను…