India GDP: భారత ఆర్థిక వ్యవస్థ ఊహించని విధంగా దూసుకెళ్తోంది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా పరుగులు తీస్తోంది. కేవలం దశాబ్ద కాలంలోనే భారత జీడీపి ఏకంగా 105 శాతం పెరిగింది. భారతదేశం తన స్థూల దేశీయోత్పత్తి (GDP)ని 2015లో $2.1 ట్రిలియన్ల నుండి 2025 నాటికి $4.3 ట్రిలియన్లకు రెట్టింపు అయింది. ఇలాంటి రికార్డ్ ఏ దేశానికి కూడా లేదు. కేవలం పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ డబుల్ అయింది.
China: పొరుగు దేశమైన చైనా ప్రస్తుతం గగ్గోలు పెడుతోంది. ఆ దేశంలో నానాటికీ వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. సంతానోత్పత్తి విపరీతంగా పడిపోయింది. పిల్లలను కనడమే అక్కడ జనం మానేశారు. దీని ప్రభావం అక్కడి దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తుండటంతో చైనా ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది.
China: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాకు నిరంతరం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అమెరికాకు చెందిన బడా కంపెనీలు దేశాన్ని విడిచిపెట్టి భారత్‌లో తమ తయారీ యూనిట్లను నెలకొల్పుతుండగా, మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు పడడం లేదు.