దేశ వ్యాప్తంగా నెలకొన్న కుక్కల బెడదపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఇటీవల కుక్కల సమస్యపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయంగా భారతదేశ గౌరవం డ్యామేజ్ అవుతున్నా మేలుకోరా? అంటూ వ్యాఖ్యానించింది.
కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్ సీఎస్‌కు సమన్లు జారీ చేసింది.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది..…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ, తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 8 అంశాలపైనే చర్చ జరిగింది. 1)…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారంపై దృష్టి సారించింది కేంద్రం హోంశాఖ.. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంమత్రిత్వశాఖ లేఖ రాసింది. విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి 12న జరగనున్న సమావేశానికి హాజరు కావాలని కోరిన విషయం తెలిసింది.. అందులో భాగంగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం కానున్నారు. మొదట ఢిల్లీలో ప్రత్యక్షంగా ఈ సమావేశం…