విభజన సమస్యలపై ఇవాళే కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారంపై దృష్టి సారించింది కేంద్రం హోంశాఖ.. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంమత్రిత్వశాఖ లేఖ రాసింది. విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి 12న జరగనున్న సమావేశానికి హాజరు కావాలని కోరిన విషయం తెలిసింది.. అందులో భాగంగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం కానున్నారు. మొదట ఢిల్లీలో ప్రత్యక్షంగా ఈ సమావేశం నిర్వహించాలని భావించినా.. ప్రస్తుత పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా.. వర్చువల్‌గా ఈ సమావేశం జరగనుంది..
Read Also: అర్ధరాత్రి నుంచే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ఇక, ఈ సమావేశంలో చర్చించాల్సిన తొమ్మిది అంశాలను ఎజెండాలో పొందుపర్చింది కేంద్రం… విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన, విద్యుత్ బకాయిలు, ఏపీ-ఎస్ఎఫ్సీ విభజన, సింగరేణి కార్పొరేషన్‌తో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజన, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, విభజన చట్టంలో పొందుపర్చిన ప్రకారం పన్ను బకాయిలు, బ్యాంకు డిపాజిట్లలో మిగిలిన నగదు పంపకాల అంశాలు ఎజెండాలో పెట్టింది కేంద్ర హోంశాఖ.. వీటితో పాటు ఇతర అంశాలపైనా… విభజనచట్టంలోని హామీల అమలు, వాటి పురోగతిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. మొత్తంగా విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!