కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దాదాపుగా 100 మంది ఎమ్మెల్యేలు డీకే.శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నారని ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాక ముఖ్యమంత్రి పీఠంపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య పోటీ తప్పలేదు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సిద్దరామయ్యకే సీఎం పీఠం అప్పగించి డీకేకు ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ కు సీఎం పదవి రాకపోవడంపై పలువురు కాంగ్రెస్ నేతలు గతంలో బాహాటంగానే అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా అధికార మార్పిడిపై డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కన్నడ…
ED Raids: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తాజా సోదాలు నిర్వహించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. కర్ణాటకలోనిమైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) సంబంధించిన లింక్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం మంగళూరు, బెంగళూరు, మాండ్య, మైసూరులోని పలు ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసులో సిద్ధరామయ్యపై కేసు నమోదు చేసిన…
ప్రముఖ కన్నడ సాహితీవేత్త ‘నాడోజ’ కమల హంపన (88) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె కన్నుమూశారు. శనివారం బెంగళూరులోని రాజాజీ నగర్ నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కర్ణాటకలోని గిరిజనాభివృద్ధి సంస్థ నుంచి ప్రైవేటు బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో నిధులను అక్రమంగా మళ్లించారనే ఆరోపణలతో ఆ రాష్ట్ర షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, యువజన సాధికారత, క్రీడల శాఖ మంత్రి బి నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బెంగళూరులో పత్రాన్ని సమర్పించారు.
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కర్ణాటక ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ శుక్రవారం బెంగళూరు కోర్టుకు హాజరయ్యారు.