రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. దీంతో జూలై 24లోపే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనున్నాయి. జూలై 25న భారత దేశానికి కొత్త రాష్ట్రపతి కొలువుదీరనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జూన్ 15న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల చివరి గడవు జూన్ 29గా సీఈసీ…