India-Bangladesh: బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య స్నేహబంధం రోజురోజుకు పెరుగుతోంది. అదే సమయంలో అక్కడి జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)లు భారత వ్యతిరేకతను పెంచుతోంది. షేక్ హసీనా పదవి పోయిన తర్వాత అక్కడి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ యూనస్ పాకిస్తాన్‌తో అంటకాగుతున్నాడు.
దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు భారీ కుట్ర భారీ కుట్ర పన్నిన ఓ గ్యాంగ్‌ని పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల అరెస్టయిన అన్సార్-అల్-ఇస్లామ్ బంగ్లాదేశ్‌కు చెందిన ఎనిమిది మంది అనుమానిత సభ్యులను అరెస్ట్ చేశారు. వీళ్లు 'చికెన్ నెక్'పై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు పోలీసు ఓ ఉన్నతాధికారి సమాచారం అందించారు. 'చికెన్ నెక్' అనేది పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే కారిడార్. సిలిగురి కారిడార్‌లో వరుస దాడులు చేసి.. పెద్ద ఎత్తున గందరగోళం…