Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ తొలివిడత ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు. ఈ రోజు మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపుగా 20 నిమిషాల పాటు కాల్పులు కొనసాగాయి. ఈ ఘటన సుకుమా జిల్లాలోని తాడ్‌మెట్ల, దూలెడ్ గ్రామాల మధ్య పనావర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్నికల నిర్వహణకు వెళ్లిన బీఎస్‌ఎఫ్ డీఆర్‌జీ బృందంపై నక్సలైట్ల కాల్పులు జరిపారు. ప్రస్తుతం భద్రతాసిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తోంది. ఈ ఘటన బండే పోలీస్ స్టేషన్…
Mahadev App case: ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆ రాష్ట్రంలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్‌కి ఈ కేసు చుట్టుకుంటోంది. ఇటీవల రూ.5 కోట్లతో ఈడీకి పట్టుబడిన కొరియర్, సీఎంకి యాప్ ప్రమోటర్లు రూ. 508 కోట్లు చెల్లించారని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ కావాలనే ఇలా చేస్తుందంటూ ప్రతివిమర్శలు చేశారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. బీజేపీ నేతను మావోయిస్టులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రతన్ దూబ బీజేపీ నారాయణపూర్ జిల్లా విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. శనివారం రోజు జిల్లాలోని కౌశల్నార్ ప్రాంతంలో రతన్ దూబేను మావోయిస్టులు చంపేవారు. ఆయన జిల్లా పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.