కొన్నిసార్లు మనం లోతైన ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు లేదా ఆందోళన, భయంతో చుట్టుముట్టబడినప్పుడు.. మన హృదయ స్పందన అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ పరిస్థితి చాలా మందికి సంభవిస్తుంది. సాధారణంగా ఓ వ్యక్తి హృదయ స్పందన నిమిషానికి 60 నుంచి 100 బీట్స్ (BPM) ఉంటుంది. కానీ హృదయ స్పందన రేటు 100 BPM కంటే ఎక్కువగా ఉంటే.. దానిని 'టాచీకార్డియా' అంటారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఏదైనా వ్యాధికి సంకేతమా? అనే విషయాలను తెలుసుకుందాం..
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధన్ఖడ్‌ను క్రిటికల్ కేర్ యూనిట్‌లో చేర్చారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
TB Disease: టిబి వ్యాధిని క్షయవ్యాధి అని పిలుస్తారు. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే అంటువ్యాధి. సకాలంలో వైద్య సహాయం పొందడానికి, అలాగే సంక్రమణ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి టిబి వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. టిబి వ్యాధి అనేది చికిత్స చేయకుండా వదిలేస్తే తీవ్రమైన పరిణామాలను కలిగించే తీవ్రమైన సంక్రమణ. టిబి వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవడం ద్వారా.. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మీరు ఈ అంటువ్యాధి…
Symptoms of a Heart Attack: గుండెపోటు విషయానికి వస్తే.. అది జీవితం, మరణానికి సంబంధించిన విషయం. కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెపోటును త్వరగా గుర్తించి అందుకు సంబంధించిన జాగ్రత్తలను తీసుకోవచ్చు. మీరు వెంటనే వైద్య సహాయం పొందడానికి వీలుగా సంకేతాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. మరి ఆ గమనించవలసిన కొన్ని సాధారణ లక్షణాలు ఒకసారి చూద్దాం. ఛాతీ నొప్పి: గుండెపోటు అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి ఛాతీ నొప్పి లేదా…
Mithun Chakraborty was admitted in hospital in Kolkata: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఛాతీ నొప్పితో బాధపడిన ఆయన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో.. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిథున్ చక్రవర్తికి ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో హతుడి మామ అమృతరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఆ కేసులో మరో నిందితుడు అబ్దుల్ బారీకి గుండె నొప్పి రావడంతో అతడిని నిమ్స్ కు తరలించారు జైల్ అధికారులు. గుండె నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించామని, చికిత్స జరుగుతోందని జైలు అధికారులు తెలిపారు. ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీ రావుకు సుపారీ గ్యాంగ్ ను సమకూర్చి పెట్టాడు రౌడీ షీటర్ అబ్దుల్…
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్ళారు. సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి వుంది. అయితే అనారోగ్యం వల్ల ఆయన పర్యటన రద్దయింది.ఇటీవల కాలంలో ఢిల్లీ, మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళి వచ్చారు. ఈమధ్యకాలంలో తీవ్ర వత్తిడికి గురయ్యారు. అస్వస్థత కారణంగా యాదాద్రికి వెళ్ళి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి వుంది. కానీ పర్యటన రద్దు చేశారు. ముఖ్యమంత్రి…