అంతర్జాతీయ చెస్ ఒలంపియాడ్‌లో భాగంగా ఓ మహిళ కలెక్టర్ రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది... చెస్ బోర్డుపై పావుల స్థానంలో మనుషులే పాత్రధారులైతే ఎలా ఉంటుందో ఓ వీడియో రూపంలో తెరకెక్కించారు.
44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ జూలై 28న చెన్నైలోని మహాబలిపురంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని నేపియర్ బ్రిడ్జ్‌కి చెస్ బోర్డులా పేయింట్ వేశారు. ఈ బ్రిడ్జ్ ప్రయాణికులను అత్యద్భుతంగా ఆకట్టుకుంటోంది. వందేళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. చెస్ బోర్డులా పెయింట్ వేయబడిన ఈ వంతెన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.