Bird Flu : నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫారంలో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురి చేసింది. గ్రామంలోని రైతులు తాము నష్టపోయిన విషయాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వ సహాయం కోరుతున్నారు. చెరుకుపల్లి గ్రామంలోని పౌల్ట్రీ ఫారంలో గత కొన్ని రోజులుగా కోళ్లు అనారోగ్యానికి గురవుతుండగా, ఈ సమస్య మరింత తీవ్రమై సుమారు 7,000 కోళ్లు ఆకస్మికంగా మరణించాయి. ఈ ఘటనతో గ్రామస్తుల మధ్య భయాందోళనలు వ్యక్తమయ్యాయి.…