ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. 18వ సీజన్‌లో భాగంగా నేడు రెండు టీంలు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా.. అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ రోజు కూడా అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. గత 12 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ జట్టు తొలి మ్యాచ్‌లో గెలవకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా లేకుండా ముంబై ఇండియన్స్ ముందుకెళ్తోంది.…
ఐపీఎల్ 2025 మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ముంబై ఇండియన్స్ జట్టు సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉంటుంది. గత ఐపీఎల్ సీజన్‌లో మూడోసారి స్లో ఓవర్ రేట్‌ను ఉల్లంఘించినందుకు ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. ఈ నిషేధం కారణంగా, హార్దిక్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మొదటి…
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ గురించి మరోసారి ఓపెన్ అయ్యాడు. 43 ఏళ్ల ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. గత సీజన్ తనకు చివరి సీజన్ అవుతుందని క్రికెట్ అభిమానులు భావించినప్పటికీ.. రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు. 2025 సీజన్ కూడా ఆడనున్నాడు. ఈ ఎడిషన్ ముగిసిన తర్వాత ఆటకు గుడ్‌బై చెబుతాడని మళ్లీ గుసగుసలు మొదలయిన…
ఐపీఎల్ 2025లో మార్చి 28న సీఎస్కే, ఆర్సీబీ తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బద్రీనాథ్ ఆర్సీబీని ఎగతాళి చేస్తూ ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ సంగ్రామం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ హోంగ్రౌండ్‌లలో ప్రాక్టీస్‌లలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మెంటర్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని టీమ్స్ లో కొత్త ఆటగాళ్ల రాకతో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. టోర్నమెంట్ మొదటి రెండు రోజుల్లోనే రసవత్తరమైన మ్యాచ్‌లు ఉండబోతుండటంతో క్రికెట్ లవర్స్ ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. మార్చి 22న ఐపీఎల్ 2025 గ్రాండ్ ఓపెనింగ్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగనుంది. మరుసటి రోజు…
IPL 2025: ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాకుండా.. కోట్లాది మంది అభిమానులకు ఉత్సాహాన్ని, వినోదాన్ని పంచే గొప్ప పండుగ అని చెప్పవచ్చు. ఈ సారి జరగబోయే ఐపీఎల్ 2025 సీజన్ ను మరింత సులభతరం చేసేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL), చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MTC) కలిసి కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హోమ్ మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానుల కోసం ఈ…
ఐపీఎల్ 2025లో రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరపున ఆడనున్నాడు. కాగా.. 2009లో సీఎస్కే తరుఫున అశ్విన్ అరంగేట్రం చేశాడు. 2015 వరకు ఏడు సీజన్లు చెన్నైకి ఆడాడు. ఆ తర్వాత 2016, 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. 2018లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు.
IPL 2025 MS Dhoni: మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) భారత క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా గుర్తింపు పొందాడు. “కూల్ కెప్టెన్” గా పేరుగాంచిన ధోనీ తన అద్భుతమైన నాయకత్వంతో భారత జట్టుకు 2007 టి20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. అంతేకాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపాడు. ధోనీ బౌలర్లను సమర్థంగా…
ధోని తన రిటైర్మెంట్ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టాడు. "నేను నా క్రికెట్ కెరీర్‌లోని చివరి కొన్ని సంవత్సరాలను ఆస్వాదించాలనుకుంటున్నాను," అని ధోని తెలిపాడు. ధోని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తప్ప మరే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడు. అయితే.. కొన్నేళ్లుగా అతని బ్యాటింగ్ ప్రదర్శనలో మార్పు వచ్చింది. కేవలం అతని అభిమానుల కోసం క్రికెట్ ఆడుతున్నట్లుగా అనిపిస్తోంది. గత సీజన్‌లో ధోని బ్యాటింగ్ లైనప్‌లో 8వ స్థానంలో దిగాడు. గత సీజన్‌లో ధోని మొత్తం 73 బంతుల్లో 161…