మ్యాచ్‌లో ఓ కీలక ఘట్టం మతిష పతిరానా వేసిన బౌన్సర్ కారణంగా చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ ఈ బౌన్సర్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌కు తాకిన తర్వాత హెల్మెట్‌కు తాకింది. ఇది చూసి స్టేడియంలో ఉన్న అభిమానులు కాస్త భయాందోళనకు గురయ్యారు. అయితే.. కోహ్లీ కొంత సమయం తర్వాత మళ్లీ ఆట కొనసాగించాడు. ఈ క్రమంలో.. పతిరానా మరో బౌన్సర్ వేయగా, కోహ్లీ ఆ బంతిని ఫైన్ లెగ్ వైపు సిక్స్‌గా…
చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025లో వికెట్ల వెనుక చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ధోని చిరుతపులి వేగంతో ఫిల్ సాల్ట్‌ను స్టంప్ చేసి సీఎస్కేకు కీలకమైన బ్రేక్ అందించాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు ఉండనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025లో భాగంగా.. కాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 2025లో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఆసక్తికర పోరు ఉండనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సాధించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్‌పై 1053 పరుగులు చేశాడు. కేవలం ఐదు పరుగులు చేస్తే.. అతను చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు.
IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2008లో ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనను చూపించారు. అయితే, అత్యధిక ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2024 సీజన్ వరకు ధోనీ 11 ఐపీఎల్ ఫైనల్స్ లో పాల్గొన్నాడు. అతని తర్వాత ఇతర ప్రముఖ ఆటగాళ్లు కూడా అత్యధిక ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన లిస్ట్ లో స్థానాన్ని సంపాదించారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నై తొలి మ్యాచ్‌లో విజయ కేతనం ఎగుర వేసింది. గత 12 సంవత్సరాలుగా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు.. ఈ ఏడాది కూడా అదే పరంపరను కొనసాగించింది.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) , ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ సేన 155 పరుగులు సాధించింది. సీఎస్‌కే విజయానికి 156 పరుగులు అవసరం. తిలక్ వర్మ 31 పరుగులు చేయగా.. కెప్టెన్…
ఐపీఎల్ (IPL) సీజన్ మొదలైతే చాలు, పాత రికార్డులకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ప్రతి సీజన్‌లో ఉన్న రికార్డులు బద్దలై కొత్త రికార్డులు పుట్టుకొస్తుంటాయి. కానీ, కొన్ని అరుదైన ఫీట్లను అందుకోవడం మాత్రం అంత తేలిక కాదు. తాజా డకౌట్ తో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్లు అయిన గ్లెన్ మాక్స్ వెల్ సరసన చేరాడు. గ్లెన్ మాక్స్ వెల్ కూడా ఐపీఎల్ ఇప్పటివరకు 18 సార్లు డకౌట్ అయ్యాడు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో మూడో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెపాక్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట ముంబై బ్యాటింగ్ చేయనుంది. కాగా.. హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ రితురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే జట్టు కొత్త ఉత్సాహంతో ప్రవేశిస్తుంది. రెండు…