ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ సింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(57), ఓపెనర్ డేవాన్ కాన్వే(47) అద్భుతంగా రాణించారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అదిరిపోయే సిక్సర్లు బాదడం విశేషం.
ధోని.. తమ బౌలర్ల ఆట తీరుపై మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పరిస్థితి ఇలాగే ఉంటే కొత్త కెప్టెన్ సారథ్యంలో ఆడాల్సి వస్తుంద(తాను తప్పుకొంటానని)ని నవ్వుతూనే గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
ఐపీఎల్2023లో గెలుపుతో సంతోషంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడిన స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ .. ఈ మెగా టోర్నీ మొత్తం దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ ప్రారంభం కాబోతుంది. ఈ 16వ సీజన్ లో తొలి పోరులో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 ఫార్మాట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఇంకో 24 గంటల్లో ప్రారంభం కాబోతుంది. అయితే తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్ టైటాన్స్.. నాలుగు సార్లు టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మధ్య జరుగునుంది.
కరోనా నేపథ్యంలో గత మూడు సీజన్ లు పలు ఆంక్షల మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) టీ20 క్రికెట్ టోర్నీక మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఈ సంవత్సరం ఎలాంటి ఆంక్షలు లేకుండా అభిమానులకు పూర్తి స్థాయిలో వేసవిలో పరుగుల విందు అందించడానికి ఐపీఎల్ జట్లు సిద్దమయ్యాయి.