CSK vs LSG: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి చవిచూసింది. చెన్నై జట్టు కుదిర్చిన 218 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో.. 12 పరుగుల తేడాతో సీఎస్కే ఈ సీజన్‌లో తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే.. చివరివరకు లక్నో జట్టు కనబర్చిన పోరాటపటిమ మాత్రం అందరి మనసుల్ని దోచుకుంది.
Mission – Chapter 1: నాలుగు భాషల్లో భారీఎత్తున విడుదలవుతున్న మిషన్: చాప్టర్ 1
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57), డెవాన్ కాన్వే (47) అద్భుత శుభారంభం అందించడం.. మధ్యలో శివమ్ దూబే (27), అంబటి రాయుడు (27) మెరుపులు మెరిపించడం వల్ల.. చెన్నై జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో ధోనీ కొట్టిన రెండు సిక్సులు కూడా హైలైట్‌గా నిలిచాయి. వచ్చి రాగానే తొలి రెండు బంతుల్ని అతడు సిక్సర్లుగా మలచడంతో.. ఆ మైదానం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. మూడో బంతిని కూడా సిక్స్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు కానీ, క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Mohanlal: మోహన్‌లాల్ పచ్చి మోసగాడు.. చనిపోయేలోపే అతని బండారం బయటపెడతా
ఇక 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు.. కైల్ మేయర్స్ పుణ్యమా అని మొదట్లో పరుగుల వర్షం కురిపించింది. కేవలం 5.2 ఓవర్లలోనే లక్నో జట్టు 79 పరుగులు చేయలిగిందంటే.. కైల్ మేయర్స్ ఎలా చెలరేగిపోయి ఉంటాడో మీరే అర్థం చేసుకోండి. అయితే.. అతడు ఔటయ్యాక లక్నో ఒక్కసారిగా నెమ్మదించింది. అప్పటినుంచి వరుసగా వికెట్లు పడుతూ వచ్చాయి. మధ్యలో స్టోయినిస్, పూరన్ కలిసి ఆశలు చిగురించారు. కానీ, చెన్నై బౌలర్స్ ధాటి ముందు వాళ్లు నిలవలేకపోయారు. చివర్లో వచ్చిన ఆటగాళ్లు కూడా గట్టిగానే ప్రయత్నించారు కానీ, అప్పటికే ఆలస్యం అవ్వడంతో, లక్నో ఓటమిపాలయ్యింది.