Sindhu river: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని చనిపోయారు. ఈ ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్‌ని తన నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా, ‘‘సింధు నది జలాల’’ ఒప్పందం నిలిపేసింది. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం దాయాది దేశంలో భయాన్ని పుట్టిస్తోంది. సింధు దాని ఉపనదులు పాకిస్తాన్ 80 శాతం ప్రజలకు జీవనాధారం. ఇప్పుడు, ఇండస్ వాటర్ ట్రిటీని నిలిపేయడంతో పాకిస్తాన్‌ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
India Pakistan: పాకిస్తాన్‌కి మరో బిగ్ షాక్ ఇచ్చింది భారత్. 24 గంటల పాటు చీనాబ్ నది నీటిని దిగ్బంధించిన భారత్ ఇప్పుడు ఆ నీటిని ఒక్కసారిగా వదిలినట్లు సమాచారం.
India Pakistan Tension: పాకిస్తాన్‌కి భారత్ దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతోంది. ఈ వేసవిలో పాకిస్తాన్ గొంతెడటం ఖాయంగా కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో పాకిస్తాన్ పాత్ర స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. పాక్‌కి చెందిన లష్కరేతోయిబా, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ప్రమేయం ఉన్నట్లు మన ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలు సేకరించాయి.
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ ఎప్పుడు, ఎలా, ఎక్కడ విరుచుకుపడుతుందో తెలియక ఆ దేశం భయాందోళనలో ఉంది. బయటకు భారత్‌ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఈ ఘర్షణ ముగించేందుకు పాక్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. తటస్థ, పారదర్శక విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటిస్తోంది.
Chenab river: పాకిస్తాన్‌ని చావు దెబ్బతీసింది భారత్. అప్పుడెప్పుడో నెహ్రూ హాయాంలో పాక్ అధినేత అయూబ్ ఖాన్‌తో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధూ నదీ జలాల ఒప్పందం జరిగింది. అయితే, పలు సందర్భాల్లో భారత్‌ను దెబ్బకొట్టేందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని, ఉగ్రదాడుల్ని చేస్తున్నా.. ఈ ఒప్పందం జోలికి మాత్రం భారత్ ఏనాడు వెళ్లలేదు. అయితే, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్‌కి ఎక్కడ కొడితే దెబ్బ గట్టిగా తగులుతుందో చూసి ఇండియా దెబ్బ కొడుతోంది. తాజాగా మరోసారి అలాంటి…
చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన గోల్డెన్ జాయింట్‌ను శనివారం ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను నిర్మించారు. కశ్మీర్ రైల్వే ప్రాజెక్ట్‌లోని ఉదంపుర్-శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జి ఉంది.