Pashamilaram-Incident : సిగాచి ప్రమాదంలో ఎన్నో జీవితాలు కూలిపోయాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. వింటుంటేనే కన్నీళ్లు ఆగవు. తాజాగా ఓ నవదంపతుల కథ అందరినీ కలిచివేస్తోంది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఇప్పటి వరకు 36 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మృతుల్లో కడప జిల్లాకు చెందిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలోనే వీరి ఆచూకీ…
Gas Leak: మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్‌నాథ్ లోని కెమికల్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ కావడం కలకలం సృష్టించింది. నగరం అంతటా రసాయన పొగ వ్యాపించింది. ప్రజలు తమ కళ్లలో మంట, గొంతు నొప్పిని అనుభవిస్తున్నారని సమాచారం. నగరం అంతటా పొగలు వ్యాపించడంతో అక్కడ పట్టపగలే ఏమి కానరాకుండగా పరిస్థితి మారింది. థానే అగ్నిమాపక దళం ప్రకారం, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ప్రజలు కళ్లలో మంట, గొంతు నొప్పి వంటి…
ఘజియాబాద్లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. చాలా దూరం వరకు భారీగా పొగలు అలుముకున్నాయి. స్థానిక అగ్నిమాపక శాఖ అనేక అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించి మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టింది.
హర్యానాలోని సోనిపట్ లోని ఫిరోజ్ పూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో అపార ఆస్తి నష్టం సంభవించింది. ఈ రాసే నాటికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న తరువాత అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు కొన్ని గంటలపాటు పోరాడారు. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు ఆన్‌లైన్ లో కనిపించాయి. కర్మాగారం నుండి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ…
థానే కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముంబైకి సమీపంలోని థానేలోని డోంబివాలిలో గురువారం భారీ పేలుడు సంభవించింది.
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థానేలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి.
మహారాష్ట్ర జలగావ్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు.
సంగారెడ్డి జిల్లాలో బుధవారం నాడు సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ దగ్గర ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చేలరేగడంతో అక్కడే పని చేస్తున్న పలువురు కార్మికులు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో గల కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్బీ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఎగిరిపడ్డారు.
Rajasthan Blast : రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు సజీవ దహనం అయ్యారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.