East Godavari: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విజన్ డ్రగ్స్ పరిశ్రమలో ఇథైల్ కాలమ్ గొట్టంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కెమికల్ ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో చాగల్లుకు చెందిన మహీధర్ ముసలయ్య, తాజ్యంపూడి వాసి రత్నబాబు, గౌరీపట్నంకు చెందిన సత్యనారాయణ…
యూపీలోని హాపూర్ జిల్లా ధౌలానాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12మంది మృతిచెందారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఢిల్లీకి 60కిలోమీటర్ల దూరంలోని ధౌలానాలోని పారిశ్రామిక కేంద్రంలో ఉంది. ఈ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా బాయిలర్ పేలింది. పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని…
యాదాద్రి జిల్లాలోని వంగపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలుడు ధాటికి కెమికల్స్ ఎగసిపడ్డాయి. దీంతో ఫ్యాక్టరీ మొత్తం దట్టంగా పొగ కమ్ముకుంది. సైరన్ మోగడంతో కార్మికులు భయంతో పరుగులు తీయగా.. ఏం జరిగిందో తెలియక ప్రజలు భయంతో వణికిపోయారు. కెమికల్స్ రోడ్డుపైన పడటంతో పాటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక…