Mumbai: థానే కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థానేలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయాయి.
ముంబై సమీపంలోని థానేలోని డోంబివాలిలో గురువారం మధ్యాహ్నం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో అనేక మంది కార్మికులు చిక్కుకుపోయారు. MIDC ఫేజ్ 2లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ భారీ పేలుడికి నలుగురు మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఫ్యాక్టరీలో మూడు పేలుళ్లు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కనీసం ఎనిమిది మందిని రక్షించినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తెలిపారు.
Also Read
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
డోంబివిలి ఎంఐడీసీలోని అముదన్ కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలిన ఘటన బాధాకరమని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు .ఈ ఘటనలో 8 మందిని రక్షించారని.. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మరిన్ని అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచామని.. దీనిపై కలెక్టర్‌తో చర్చిస్తున్నట్లు చెప్పారు. NDRF, TDRF. అగ్నిమాపక దళం 10 నిమిషాల్లోనే సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు దాదాపు 15 ఫైర్ ఇంజన్లు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇక మంటలను అదుపులోకి తెచ్చేందుకు నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. కార్ షోరూమ్ సహా మరో రెండు భవనాలకు మంటలు వ్యాపించాయి.
తాజావార్తలు
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!