Earthquake: నేడు (సెప్టెంబర్ 21) బంగ్లాదేశ్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మేఘాలయలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ భూకంపం ఉదయం 11:49 గంటలకు (IST) బంగ్లాదేశ్‌తో మేఘాలయ సరిహద్దుకు సమీపంలో సంభవించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, మేఘాలయలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా బంగ్లాదేశ్‌లోని ఢాకా, చిట్టగాంగ్‌తో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే, ఈ ఘటనలో…