ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు తెరమీదకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన చార్డెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుకు ప్రవీణ్ సన్నిహితుడిగా ఉన్నాడు ఈడీ చార్జీషీట్ లో ప్రవీణ్ పేరు నమోదు చేసి.. ప్రవీణ్ కుమార్ పాత్రపై ఈడీ అధకారులు దర్యాప్తు చేస్తున్నారు.
చైనా యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అతడిని విచారణ చేస్తుంది. ఫోర్జరీ బిల్లులతో రూ.1,100 కోట్లు చైనాకు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బోగస్ బిల్లుల జారీలో సీఏ రవికుమార్ పాత్ర కీలకంగా ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. నకీలీ చైనా యాప్‌లను ఇండియాలో ప్రవేశపెట్టేందుకు అతడు యత్నించినట్టు నాంపల్లి కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు. బోగస్ బిల్లుల జారీలో రవికుమార్…