ఉప్పరపల్లి గౌతమ్ నగర్ లో ఎస్‌బీ ఇన్స్పెక్టర్ పై దాడి జరిగింది. చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబంలో పదిమంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల వివరాలు నోట్ చేస్తుండగా ఆగ్రహంతో సీఐపై మృతుల బంధువుల దాడి చేశారు. మీడియాను మృతుల కుటుంబ సభ్యులు అనుమతించలేదు. గౌతమ్ నగర్ కు వెళ్లిన మీడియా, పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mirchowk Fire Accident : హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్‌చౌక్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం మరింత విషాదాన్ని నింపింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరుకుంది. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉండటం హృదయాలను కలిచివేస్తోంది. మృతి చెందిన చిన్నారుల్లో ఒకటిన్నర సంవత్సరం వయస్సున్న ఒకరు, ఏడేళ్ల వయస్సున్న మరొకరు ఉన్నారు. మిగిలిన ఆరుగురు పిల్లలు నాలుగు సంవత్సరాల లోపు వారే కావడం ఈ దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తోంది.…