ఏపీలో గెలుపు ఎన్డీయేదేనని ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కన్నారు. కూటమికి మోడీ అండ ఉందన్నారు. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటేనన్నారు. ఏపీ కోసం మూడు పార్టీలు జట్టు కట్టాయన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా అని పేర్కొన్నారు. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని ఆయన తెలిపారు. మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసమని…
టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ప్రజాగళం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి లేక అప్పులతో నలుగుతోందని ఆరోపించారు. దాష్టీకాలతో ఏపీ ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఏపీకి మోడీ రాక ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.
వైసీపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలపై మండిపడ్డారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గన్నవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి మొహాన్ని కనబడకుండా చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా డయాస్ కట్టిన వంశీ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు.సామాజిక న్యాయానికి సమాధులు కట్టి బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. వై.వి.సుబ్బారెడ్డికి మోకాళ్ళ మీద దణ్ణాలు పెట్టిన వాళ్లు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా..?ఒక్క పైసా కూడా కార్పొరేషన్ ద్వారా ఏ…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలతో వాతావరణం మరింతగా వేడెక్కింది. బస్సు యాత్ర పై చంద్రబాబు విషం కక్కుతున్నాడు. ప్రజలు రాజకీయ సమాధి కడతారు. మహానాడుకు భయపడుతున్నారు అనటానికి చంద్రబాబు కు సిగ్గు ఉండాలి. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చవట సన్నాసి జగన్ ను ఓడిస్తాడట. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని. చంద్రబాబు, మహానాడు తీరుపై నిప్పులు…