ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలతో వాతావరణం మరింతగా వేడెక్కింది. బస్సు యాత్ర పై చంద్రబాబు విషం కక్కుతున్నాడు. ప్రజలు రాజకీయ సమాధి కడతారు. మహానాడుకు భయపడుతున్నారు అనటానికి చంద్రబాబు కు సిగ్గు ఉండాలి. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చవట సన్నాసి జగన్ ను ఓడిస్తాడట. చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని.
చంద్రబాబు, మహానాడు తీరుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కొడాలి నాని. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని తనదైన రీతిలో చంద్రబాబుని ఆడేసుకున్నారు. చంద్రబాబు ఎందుకు బతికి ఉన్నాడో అతనికే తెలియదు. ఎన్టీఆర్ చెప్పినట్లు చంద్రబాబు జామాత దశమ గ్రహం. ఎన్టీఆర్ ను చంపి, పూల మాలలు వేస్తున్నది చంద్రబాబు. అమలాపురంలో మా ఎమ్మెల్యే, మంత్రి ఇళ్ళకు నిప్పంటించి మళ్ళీ చంద్రబాబు ఆరోపణలు చేస్తాడు. జనసేన నిక్కర్ల బ్యాచ్
జగన్ గట్టిగా చూస్తే చచ్చే వెధవలు తొడలు కొడుతున్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వారు ఆ వేదిక మీద ఉన్నారు. పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడు పార్టీ అధ్యక్షుడట. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన గ్రహం అని దుయ్యబట్టారు కొడాలి నాని. బీసీ, ఎస్సీ ఎస్టీ వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. 80 శాతం మంది ప్రజల కోసం జగన్ ని ఎందుకు పంపుతారు. 20 శాతం మంది కోసం రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలు, 420 గాళ్ళకు రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కడతారన్నారు. వైసీపీకి బ్రహ్మరథం పడతారన్నారు కొడాలి నాని.
చంద్రబాబునాయుడు దత్త పుత్రుడు, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నారని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఊరూరా తిరిగి జగన్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను టీడీపీ విమర్శించడంపై మండిపడ్డారు. జగన్ ని భ్రష్టపెట్టించాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగవన్నారు.
NTR Birthday : ఇచ్చినా ఇవ్వకపోయినా భారతరత్నమే.!