kangana ranaut interesting Comments on ISRO Women Scientists: చంద్రయాన్ 3 ప్రయోగంతో భారత కీర్తిపతాకాన్ని నలుదిశలా ఎగురవేసింది ఇస్రో. చంద్రుని దక్షిణ ధ్రువంపైకి చేరుకొని అంతరిక్ష చరిత్రలోనే చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ఇక చంద్రుడి రహస్యాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది ఇస్రో. ఇక ఇప్పటికే రోవర్ ఆ పనిని మొదలు పెట్టేసింది. ఇస్రో సాధించిన విజయంతో అనేక మంది ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తాజాగా చంద్రయాన్-3 విజయంలో కీలక పాత్రలు పోషించిన మహిళా శాస్త్రవేత్తలపై బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది.
Also Read: Vijay Varma : తమన్నా కోసం ఆ రూల్ బ్రేక్ చేశా
వారి సాధారణ జీవన విధానం ఉన్నతమైన ఆలోచనలకు ప్రతిరూమని ఈ అమ్మడు ప్రశంసలు కురిపించింది. భారతదేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలలో బొట్టు బిళ్ల, తిలకం, మంగళ సూత్రం ధరించిన వాళ్లు చాలా మంది ఉన్నారని కంగనా పేర్కొంది. వారి నిరాడంబర జీవితాలకు, అత్యున్నతమైన ఆలోచనలకు ఆ బొట్టు బిళ్ల, తిలకం, తాళిబొట్టు గుర్తులే నిదర్శనమని కొనియాడింది. అదే అసలైన భారతీయత లక్షణమని ప్రశంసలు కురిపించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్‌లో శాస్త్రవేత్తల ఫొటో పోస్ట్ చేసింది కంగనా. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి కంగనా చంద్రముఖి2 సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి కంగనా లుక్ చూసిన వారు ట్రెడిషనల్ లుక్ లో కంగనా బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా చేస్తున్నారు. రజనీ కాంత్, జ్యోతిక, ప్రభు నటించిన చంద్రముఖి ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న గణేష్ చతుర్థి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.