మంత్రి రోజా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏ ఒక్కరోజు మాట మీద నిలబడడు…వైయస్సార్ ప్రారంభించిన పనులన్నీ ఆపేశారు, ఒక్క సారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దివాలా తీపించిన చంద్రబాబు మళ్లీ ఇంకొకసారి అవకాశం కావాలని అడుగుతున్నారు. చంద్రబాబు వీధి రౌడీల ప్రవర్తిస్తున్నారని విమర్శలు చేశారు మంత్రి రోజా.
Read Also: Kidney Stones : ఈ పండు తింటే కిడ్నీలో కంకరరాయి ఉన్నా కరగాల్సిందేనట
కర్నూలులో చంద్రబాబునాయుడు ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనం అని దుయ్యబట్టారు. చంద్రబాబు ,పవన్ కల్యాణ్ లు …జగన్ మోహన్ రెడ్డి మీద విషం చిమ్మి అధికారంలోకి రావాలని దిగజారుడు రాజకీయాలు చూస్తున్నారు. వైజాగ్, ఇప్పటం ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఒక పావుగా వాడుకున్నాడు…ఇప్పటం విషయంలో కోర్టును సైతం తప్పుదోవ పట్టించారు, కోర్టు సమయాన్ని వృధా చేశారు…అందుకే న్యాయమూర్తి వాళ్లకు 14 లక్షలు జరిమానా వేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని రోజా సూచించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేసిన ఘనత చంద్రబాబుది..
పవన్ కళ్యాణ్ ను కూడా వాడుకొని కరివేపాకులా చంద్రబాబు తీసిపారేస్తారని, ఈ విషయం ఆయన గ్రహిస్తే మంచిదన్నారు. పవన్ కళ్యాణ్ ఆర్టిస్ట్ గా కొనసాగితే ఫ్యాన్స్ అన్నా మిగులుతారు…ఇప్పటికే రెండు చోట్ల ఓడిపోయి కే ఏ పాల్ తో సమానంగా పవన్ కళ్యాణ్ మిగిలిపోయాడు. చంద్రబాబును నమ్మి రాంగ్ డైరెక్షన్ లో వెళ్తే పవన్ కళ్యాణ్ బొక్క బోర్లా పడటం ఖాయం అని హెచ్చరించారు మంత్రి రోజా.
Read ALso: Australia: 15 ఏళ్లుగా వరసగా అత్యాచారాలు..అయినా పట్టుబడలేదు.. చివరకు ఇలా గుర్తించారు..