YS Jagan and Chandrababu: ఢిల్లీకి సీఎం జగన్.. అదే సమయంలో చంద్రబాబు హస్తిన బాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బాటపట్టనున్నారు.. డిసెంబర్ 5వ తేదీన హస్తినకు వెళ్తారు సీఎం జగన్.. ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరుకానున్నారు వైసీపీ అధినేత.. డిసెంబర్ 1వ తేదీ 2022 నుంచి నవంబర్ 30, 2023 వరకు జీ- 20 దేశాల కూటమికి అధ్యక్షత వహించనుంది భారతదేశం.. ఈ నేపథ్యంలో భారత్ లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో చర్చించబోతున్నారు ప్రధాని మోడీ.. రాష్ట్రపతి భవన్ లో 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ సదస్సు జరగనుంది.. సమావేశానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషీ ఇప్పటికే ఆహ్వానం పంపారు.. ఈ నెల 15 వ తేదీన ఆహ్వాన లేఖ పంపారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషీ.. దీంతో, ఈ నెల 5వ తేదీన హస్తినకు వెళ్లనున్నారు సీఎం జగన్.
Read Also: Gidugu Rudra Raju: దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు డిసెంబర్ 5వ తేదీన చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారు.. ఆ రోజు ప్రధాని మోడీని చంద్రబాబు కలవనున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు మాత్రమే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో ప్రధాని సమావేశం కానున్నారు. భారత్ లో నిర్వహించే జీ 20 భాగస్వామ్య దేశాల సమ్మిట్ పై ఈ సమావేశాలలో ప్రధాని రాజకీయ పార్టీ అధ్యక్షులతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా కేంద్ర మంద్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఫోన్ చేసి ఆహ్వానించడంతో ఆయన ఢిల్లీకి వెళ్లబోతున్నారు.. అంటే, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనబోతున్నారు.. విషయం ఏదైనా.. వేదిక ఏదైనా.. ఇద్దరు నేతలు ఒకే సమావేశం కోసం ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది. ఒకే సమయంలో ఇద్దరు నేతలు పాల్గొన్న సందర్భాలు కూడా చాలా అరుదైన ఘటనే కావడం ఉత్కంఠగా మారింది.. ఈ సమయంలో ఎదురుపడితే.. మన నేతల మధ్య పలకరింపులు ఉంటాయా? నమస్కారాలు, ప్రతి నమస్కారాలు కూడా ఉండనున్నాయా? అనేది వేచి చూడాల్సిన విషయమే.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్కు రెడీ?.. గీక్బెంచ్లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!