తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల కోసమే కేసీఆర్ వ్యాఖ్యలు.. ఏడు విలీన మండలాల ప్రజలు మళ్ళీ తెలంగాణకు వెళతారా అని ఎవరో అడిగితే మేం వెళ్ళమని స్పష్టం చేశారు అని ఆయన తెలిపారు.
దొంగోడిని విడుదల చేస్తే ఆశ్చర్యకరంగా కేరింతలేంటి..? అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భువనేశ్వరి నిజమే గెలవాలంటుందని, మేము అదే అంటున్నాం నిజమే గెలవాలని అని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఎన్నికైన నాలుగేండ్ల తర్వాత పార్టీలు బయట అడుగు బయటపెట్టాలంటే భయపడేవారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.జగన్ మన గౌరవం, ఇమేజ్ పెంచారని, ప్రతి లబ్దిదారునికి మేలు జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ నేపథ్యంలో మరికొన్ని షరతులు విధించాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ఎల్లుండి(నవంబర్ 3)కి వాయిదా వేసింది.
క్రీడలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొ్న్నారు. నవంబరు 1 నుంచి 2023 సబ్ జూనియర్ టోర్నమెంట్ను సజ్జల రామకృష్ణారెడ్డి డిక్లేర్ చేశారు.